గిద్దలూరు టీడీపీ నాయకుల హర్షం: 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు

గిద్దలూరు టీడీపీ నాయకులు బొర్రా రాఘవేంద్ర యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. కేవలం 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడం కూటమి ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని, PMAY, PM JANMAN పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కల నిజమైందని తెలిపారు.

సంబంధిత పోస్ట్