పరిశ్రమల రాకతో ఏపీకి ఉపాధి: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు దార్శనికత, ఐటీ మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని తెలిపారు. గత 22 నెలల్లోనే ఏపీకి సుమారు 800 ప్రాజెక్టులు వచ్చాయని, తాజాగా అమెరికాకు చెందిన క్యారియర్ సంస్థ తన ఉత్పత్తి యూనిట్ను శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తోందని, దీనికి లోకేష్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ సానుకూల విధానాలతో ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్