ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. గురువారం గుంతకల్లు నుంచి గుంటూరుకు వెళ్లే గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి గూడ్స్ ఇంజన్ కు మరమ్మతులు చేయడంతో సమస్య పరిష్కారమైందని అధికారులు తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు అరగంటకు పైగా శ్రమించారు.