మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వేధింపుల రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ కూటమి నాయకులు వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.