రాబోయే రోజుల్లో రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తామని రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం గిద్దలూరులో రైతులతో సమావేశమై, గిట్టుబాటు ధరలు, పంటల సాగు వంటి సమస్యలపై చర్చించారు. మొక్కజొన్న, పొగాకులకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా పోరాడాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.