టిడిపిలో చేరిన జేసీ అగ్రహారం సర్పంచ్

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జెసి అగ్రహారం సర్పంచ్ రమణయ్య, బుధవారం గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితుడనై టీడీపీలో చేరినట్లు రమణయ్య తెలిపారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులు కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్