కంభం మండలం లింగోజి పల్లి గ్రామానికి చెందిన లక్షిత్ మృతి పై గురువారం కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వివరాలు వెల్లడించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీన అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. తల్లి సురేఖ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 48 గంటలుగా బాలుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. లక్షిత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.