కొన్ని విషాద చిత్రాలు హృదయాలను కలచివేస్తాయి. 2016లో సిరియాలోని శరణార్థులు టర్కీ వెళ్తుండగా పడవ మునిగి ఐలాన్ (3) మృతి చెందాడు. అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషాద చిత్రం అప్పట్లో ప్రపంచంలోని అందరి హృదయాలను తీవ్రంగా కలచివేసింది. కంభం మండలం లింగోజిపల్లికి చెందిన లక్షిత్ ఈనెల 8న అంగన్వాడి కేంద్రం నుంచి అదృశ్యమై మృతి చెందాడు. నేడు ఆ విషాద చిత్రం 2 రాష్ట్రాల ప్రజల హృదయాలను కలచివేస్తున్నాయి.