కంభం మండలం లింగోజిలో దారుణం చోటుచేసుకుంది. 2రోజుల క్రితం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన లక్షిత్ గురువారం శవమైతెలాడు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోనీ పొలాలలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 10 బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.