కంభం: బాలుడి మృతి పై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ మృతి పై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించారు. లక్షిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి అధికారుల వద్ద నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పోలీసులకు సూచించారు.

సంబంధిత పోస్ట్