ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల బాలుడు గురువారం హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు లక్షిత్ కు మృతిచెందిన చోటే అధికారులు పోస్టుమార్టం పూర్తి చేస్తున్నారు. లింగోజి పల్లిలో అదృశ్యమైన బాలుడు సూరేపల్లి సమీపంలో శవమై తేలాడు. బాలుడు హత్యకు గురికావడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.