ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం ఒక లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. నంద్యాల వైపు నుంచి గిద్దలూరు వస్తున్న లారీ దిగువమెట్టకు సమీపంలో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.