గిద్దలూరు పట్టణంలోని ఎస్ ఎస్ ప్లాజా కాంప్లెక్స్ లోని సంజీవ డీలక్స్ లాడ్జిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. లాడ్జిలోని ఓ ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, గదిలోని ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు పది లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ కాలిపోయినట్లు లాడ్జి నిర్వాహకులు తెలిపారు.