గిద్దలూరు సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద గురువారం గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, మృతుడు గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.