ఏప్రిల్ 2 నుంచి 5 వరకు నమిలిగుండ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా, రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామంలోని నెమలిగుండం రంగనాయకుల స్వామి దేవస్థానం వైభవాన్ని ప్రతిబింబించే డాక్యుమెంటరీని శనివారం అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.