పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

రాచర్ల పట్టణంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వైసిపి యజ్ఞానికి అడ్డుపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్