ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.