సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాను ప్రకటించారని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్