చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన ఎమ్మెల్యే

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 1983లో శ్రీ వివేకానంద సైన్స్ మరియు ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన, తన చిన్ననాటి స్నేహితులతో గడిపి, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదిగిన స్నేహితులను చూసి గర్వపడుతున్నానని, వారి సహకారంతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, భవిష్యత్తులోనూ వారి సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అవసరమైతే నేరుగా కలవచ్చని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితులను సన్మానించగా, స్నేహితులు ఎమ్మెల్యేను సన్మానించారు.

సంబంధిత పోస్ట్