మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ లో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పనిముట్లు అందించిందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 20 వేలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.