మద్దిపాడు మండలంలోని తుఫాన్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి తుఫాన్ పునరావాస శిబిరాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్ కుమార్, రాష్ట్ర ఇరవై సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రాచవారిపాలెం గ్రామానికి చెందిన బాధితులను కలుసుకుని వారి పరిస్థితిని తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి మధ్యాహ్న భోజనం అందజేసి, ఎవరూ ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్