మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మాజీ ఆర్మీ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన ఆర్మీ జవాన్లకు నివాళులర్పించారు. గిద్దలూరు నుంచే అత్యధికంగా ఆర్మీ ఉద్యోగులు దేశసేవకు ప్రాతినిధ్యం వహించడంపై ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్మీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.