చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చెత్త సేకరణ ట్రాక్టర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. చెత్త సేకరణ ద్వారా సంపద సృష్టించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనతో అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్