తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అర్ధవీడు మండలంలో జంపలేరు వాగు ఉధృతికి రోడ్లు తెగిపోయాయి, బొల్లుపల్లె సమీపంలో ఆర్అండ్ బి రోడ్డు దెబ్బతింది. బేస్తవారిపేట మండలం సోమవారిపేట వద్ద చితిరేల కతువ వాగు పంట పొలాలను ముంచెత్తింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పర్యటించి, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్