చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసిన నాగార్జున రెడ్డి

మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 226 రోజుల తర్వాత అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ నుంచి ఒంగోలుకు వచ్చారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు కుందూరు నాగార్జున రెడ్డి గిద్దలూరు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒంగోలుకు వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా, అన్యాయంగా కూటమి ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిందని నాగార్జున రెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్