రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూ వైఎస్ఆర్సిపి నాయకులు సోమవారం కంభం మండలం హాజరత్ గూడెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. సేకరించిన సంతకాలతో గవర్నర్ ను కలుస్తామని వైసిపి నాయకులు తెలిపారు.