రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై శనివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రులు నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్