ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒంగోలు పార్లమెంటు ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి అత్తార్ హుస్సేన్ (దాదా) లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడంతో పాటు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ముస్లిం మైనార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.