ఈసారైనా ఆదుకోండి: అరటి రైతులు

గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వాలు అరటి రైతుని ఆదుకోలేదని రైతులు వాపోతున్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షంతో గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాలలో అరటిపంట ధ్వంసం అయింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురైందని, ఈసారైనా ప్రభుత్వం ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్