ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏబీఎం పాలెం లో గురువారం ప్రేమ కుమారి అనే మహిళ తన భర్త గంగరాజు అనుమానంతో రోకలిబండతో దాడి చేయడంతో మరణించింది. సంఘటనా స్థలంలోనే దాక్కున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా బంధువులు గంగరాజుపై దాడికి ప్రయత్నించారు. సీఐ సురేష్ ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.