ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా మండలంలోని భావాపురం, మూలపల్లి, పామూరుపల్లి, మిట్టమీదిపల్లి, ఎర్రపల్లి, మల్లారెడ్డిపల్లి, గోనేపల్లి, రెడ్డిచెర్ల గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ తెలిపారు. అంతరాయానికి చింతిస్తూ ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు.