మార్కాపురం జిల్లా గిద్దలూరు టౌన్ కేఎస్పల్లి సబేస్టేషన్ పరిధిలో మార్చి 1, 2 తేదీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సెక్షన్ అధికారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది. కేఎస్పల్లి టౌన్, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ప్రతాపరెడ్డి కాలనీలలో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.