ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డి. ఈ శేషగిరిరావు తెలిపారు. మరమ్మతుల కారణంగా వెంగల్ రెడ్డి పల్లె, వెల్లుపల్లె, జయరామపురం గ్రామాలలో గృహ మరియు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.