మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.