ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలెంకు చెందిన యువతి వివాహానికి సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. పెళ్లి కుమార్తె ఇంటి నుంచి బయలుదేరగా, మార్గమధ్యంలో మూసీవాగు ప్రవహిస్తుండడంతో జెసిబి సాయంతో వాగును దాటారు. ప్రవాహం తక్కువగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణలో, అన్ని జాగ్రత్తలతో జెసిబిపై సురక్షితంగా వాగు దాటినట్లు పెళ్లివారు వివరించారు.