ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

మార్కాపురం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సంఘటనలకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్