ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం మండల విద్యాశాఖాధికారి గిరిధర శర్మ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా విద్యార్థులకు ఆయన ఆహారాన్ని వడ్డించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ఆహారాన్ని రుచి చూసి నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలన్నారు.