రాచర్ల: మాజీ సర్పంచ్ కు అంత్యక్రియలు పూర్తి

రాచర్ల మండలం ఓద్దులవాగువాని పల్లి గ్రామంలో పొలం వద్ద నీటి మోటర్ ని ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై మాజీ సర్పంచ్ అన్నపరెడ్డి భూపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి భూపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని భూపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్