రాచర్ల: ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్