విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన రాచర్ల ఎస్ఐ

ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు దాతృత్వం చాటుకున్నారు. గురువారం మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలకు క్రీడ వస్తువులను పంపిణీ చేశారు. బాగా చదువుకోవడంతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని ఎస్సై కోటేశ్వరరావు సూచనలు సలహాలు ఇచ్చారు. తర్వాత విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్