గిద్దలూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు అధికంగా ఉండే ఉష్ణోగ్రతలు సాయంత్రం తర్వాత వర్షంగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.