పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందిన సంఘటన రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. శనివారం స్థానిక రైతులు మేత కోసం గొర్రెలను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. ఉన్నటువంటి ఆకాలంగా వర్షం కురవడంతో పాటు పిడుగు పడింది. దీంతో గొర్రెలు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాయి. దాదాపు రూ. 2 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.