పశ్చిమ ప్రకాశంలో రికార్డు స్థాయిలో ఎండలు

మార్కాపురం జిల్లాలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఆదివారం 21 మండలాల్లో 10 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కంభంలో అత్యధికంగా 44.7, బేస్తవారిపేటలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నానికి వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం వేళలను అధికారులు మార్చారు.

సంబంధిత పోస్ట్