భవన నిర్మాణ కార్మికుల ముసుగులో చోరీ

అర్ధవీడు పోలీసులు ముగ్గురు భవన నిర్మాణ కార్మికులను దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కంభం సర్కిల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి నాగరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో సురేష్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనం కేసులో 120 గ్రాముల బంగారం, రూ. 50వేల నగదు దొంగిలించబడ్డాయని డిఎస్పి తెలిపారు. నిందితులపై మరో నాలుగు దొంగతనం కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్