ఈదురు గాలులతో రూ. 1. 50 లక్షలు నష్టం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవల సంభవించిన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి రూ. 1.50 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఏఈ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అకాల ఈదురు గాలుల వల్ల భారీ నష్టం జరిగిందని ఏఈ వివరించారు.

సంబంధిత పోస్ట్