ఐదు రోజుల క్రితం కంభం చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన కాటమాల అశోక్ కుమార్ (39) మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం పూసల పాడు సమీపంలో ఈతకు వెళ్లిన అశోక్ కుమార్, చెరువులో మునిగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పడవలో గాలించినా, చేపలు పట్టేవారు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బుధవారం వరకు గాలింపు చర్యలు కొనసాగినా మృతదేహం లభించలేదు.