ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ఆదివారం కంభంలో పర్యటించి, బీజేపీ కంభం మండల అధ్యక్షుడిగా బాదం కిషోర్ ను నియమించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలలో కూటమి గట్టి పోటీ ఇస్తుందని శ్రీనివాసులు విశ్వాసం వ్యక్తం చేశారు.