మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ అందరు నాగార్జున రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని చెప్పిందని, కూటమి నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని నాగార్జున రెడ్డి అన్నారు.