కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో చుక్కల దుప్పిని వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. నీళ్లు తాగడానికి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింకను పరిశీలించి, పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతోనే ఈ దుప్పి ఈ ప్రాంతంలోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్