మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శనివారం గిద్దలూరు పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ పోలీసులు నినాదాలు చేశారు. యువత తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకుండా, బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని న్యాయమూర్తి భరత్ చంద్ర విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్